టీజీ-సెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:24 AM
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీజీ-సెట్)-2026 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీజీ-సెట్)-2026 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 40,863 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 35,003 మంది హాజరయ్యారు.
వీరిలో 2,371 మంది అర్హత సాధించారు. ఓయూ వీసీ కుమార్ మాట్లాడుతూ.. సకాలంలో ఫలితాలను విడుదల చేసిన సిబ్బంది అభినందించారు. ఫలితాలను టీజీ-సెట్ అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణసెట్.ఓఆర్‌జీ, ఓయూ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఉస్మానియా.ఏసీ.ఇన్‌లో పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా