దివ్యాంగ వధువులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:38 PM
తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరికి ఈ పథకాల వర్తింపుపై విధించిన స్టేను హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. దివ్యాంగులకు మినహా మిగిలిన వారికి ఈ రెండు పథకాలపై విధించిన స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. అయితే దీనిపై వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది.
ఈ పథకాల కింద సాధారణ లబ్ధిదారులతో పోలిస్తే దివ్యాంగ వధువులకు 25 శాతం అదనంగా ఆర్థిక సాయం అందించేలా గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఈ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దివ్యాంగుల హక్కుల చట్టం నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో దివ్యాంగ వధువులకు ఈ పథకాల కొనసాగింపునకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే
Read Latest Telangana News And Telugu News