చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ABN , Publish Date - Aug 07 , 2026 | 02:47 PM
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్, ఆగస్టు 7: చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా చేనేత స్టాల్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు 7 నుంచి 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరిస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, వారసత్వానికి చేనేత ప్రతీకన్నారు.
గద్వాల, పోచంపల్లి, నారాయణపేట చేనేతకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. IIHT ద్వారా యువతకు ఆధునిక చేనేత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ‘నేతన్న భరోసా’ కింద ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ‘నేతన్నకు భద్రత’ పథకంలో రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. చేనేత రుణమాఫీకి రూ.49.27 కోట్లు విడుదల చేశామన్నారు. చేనేత రంగానికి మొత్తం రూ.980 కోట్లు ప్రభుత్వ విడుదల చేసినట్లు చెప్పారు. వేములవాడ యార్న్ డిపో ద్వారా 3096 మెట్రిక్ టన్నుల నూలు సరఫరా అవుతోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహిస్తామన్నారు. రైతన్నకు, నేతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజుకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. ఐఫోన్‌పై లోతుగా దర్యాప్తు
జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్.. మంత్రి దామోదర సీరియస్
Read Latest Telangana News And Telugu News