Share News

ప్రధాని సందేశం.. కాన్వాయ్ తగ్గించుకోవాలని తెలంగాణ గవర్నర్ నిర్ణయం

ABN , Publish Date - May 14 , 2026 | 03:52 PM

కాన్వాయ్‌ను తగ్గించుకోవాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందేశానికి తాము మద్దతు ఇస్తున్నామని గవర్నర్ వెల్లడించారు.

ప్రధాని సందేశం.. కాన్వాయ్ తగ్గించుకోవాలని తెలంగాణ గవర్నర్ నిర్ణయం
Telangana Governor

హైదరాబాద్, మే 14: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆచరిస్తున్నారు. తన కాన్వాయ్‌ను తగ్గించుకోవాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధాని సందేశానికి తాము మద్దతు ఇస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. వాహనాలను తగ్గించే ప్రధాని కార్యక్రమాన్ని తాము అమలు చేస్తున్నట్లు చెప్పారు. లోక్ భవన్‌లో ఇప్పటికే సగం వాహనాలను తగ్గించామని అన్నారు. వాహనాలను తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.


తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు.. ప్రధాని సందేశాన్ని అమలు చేయాలని గవర్నర్ కోరారు. తెలంగాణ ప్రజలు కూడా ప్రధాని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలలో ప్రధాని మోదీ సందేశాన్ని లైన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నట్లు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్

సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 14 , 2026 | 03:56 PM