Share News

ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 14 , 2026 | 03:10 PM

ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు.

ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదల
AP PGECET 2026 Results

అమరావతి, మే 14: ఉన్నత విద్యా ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(గురువారం) మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఏపీపీజీఈసెట్-2026లో 93.29 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 9,990 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. మొత్తం 9,320 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ర్యాంక్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. AP PGECET Results Portal ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ పీజీఈసెట్‌‌‌లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

వైన్ షాపు వద్ద దారుణం.. వంద రూపాయల కోసం..

ఉబర్ సీఈఓ‌తో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2026 | 03:35 PM