Share News

మత్స్యకారుల సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యం: మంత్రి వాకిటి శ్రీహరి

ABN , Publish Date - Aug 04 , 2026 | 03:14 PM

మత్స్యకారుల సంక్షేమంపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక సమావేశం నిర్వహించారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో చర్చలు జరిపారు.

మత్స్యకారుల సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యం: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari

హైదరాబాద్, ఆగస్టు 4: మత్స్యకారుల సంక్షేమంపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక సమావేశం నిర్వహించారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో చర్చలు జరిపారు. 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్‌లు, రిటైల్ షాపుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ప్రతి మూడు నెలలకు మత్స్యకార సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై సమావేశంలో చర్చించారు.


పెండింగ్ బకాయిల విడుదలకు ప్రత్యేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మధ్యాహ్న భోజనంలో చేపలను చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. సభ్యత్వ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఆన్‌లైన్‌లో చేపల విక్రయాలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దోహదం చేస్తుందని చెప్పుకొచ్చారు. రూ.1.34 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షుల ప్రోటోకాల్ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్.. 2024లో ఊహించని విజయం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 03:25 PM