విదేశీ పర్యటనకు స్పీకర్ ప్రసాద్‌కుమార్
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:09 AM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్న అసెంబ్లీ, మండలి ప్రతినిధుల బృందం
28 నుంచి అక్టోబరు 8 వరకు విదేశీ పర్యటన
వికారాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధ్యయన పర్యటన (స్టడీటూర్)లో భాగంగా ఆయన జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లనున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఆయన సతీమణి బండ అనితాప్రకాశ్, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశ్ కూడా ఆయా దేశాల్లో పర్యటించనున్నారు.
సోమవారం తెల్లవారుజామున 4.40 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ చేరుకుంటారు. ఆయా దేశాల్లోని పార్లమెంట్ హౌస్‌లను సందర్శిస్తారు. భారత రాయబార కార్యాలయాల హైకమిషనర్, సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రూ.20 వేలతో మొదలు... రూ.3.73 కోట్లు స్వాహా
Read Latest AP News And Telangana News And International News And Telugu News