Share News

రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరా పెంచండి: కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:32 PM

రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరాను పెంచాలని కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో రైతులకు డీఏపీ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన్ని మంత్రి తుమ్మల కోరారు.

రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరా పెంచండి: కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
TG Minister Tummala Nageswara Rao

హైదరాబాద్, జులై 31: రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరాను పెంచాలని కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో రైతులకు డీఏపీ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన్ని మంత్రి తుమ్మల కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. ఆగస్టుకు 50 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లో మరో 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయించాలని కోరారు.


రాష్ట్రంలో 50 శాతం వరి నాట్లు పూర్తయ్యాయని ఆ లేఖలో మంత్రి తుమ్మల వివరించారు. డీఏపీ ఎరువుల డిమాండ్ భారీగా పెరుగుతోందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో డీఏపీ ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా సహకరించాలని కేంద్రానికి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరామర్శ యాత్రగా కాకుండా, బలప్రదర్శన యాత్రగా చేయడం విడ్డూరం: మంత్రి నిమ్మల

ఆగస్టు చివరలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు శ్రీకారం: మంత్రి పొంగులేటి

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 06:39 PM