Share News

విద్యార్థులకు తొలి రెండు జతల యూనిఫామ్‌ల పంపిణీ పూర్తి: రవి గుగులోతు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:11 AM

ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు తొలి రెండు జతల యూనిఫామ్‌ల పంపిణీ వంద శాతం పూర్తయిందని పీఎంయూ ఛైర్మన్‌ రవి గుగులోతు ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు తొలి రెండు జతల యూనిఫామ్‌ల పంపిణీ పూర్తి: రవి గుగులోతు

ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు తొలి రెండు జతల యూనిఫామ్‌ల పంపిణీ వంద శాతం పూర్తయిందని పీఎంయూ ఛైర్మన్‌ రవి గుగులోతు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 27,29,515 జతలు, రెండో విడతలో మరో 27,29,515 జతల యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించినట్లు వివరించారు.


ఈ విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు అదనంగా ప్రవేశపెట్టిన తెల్ల యూనిఫామ్‌ల పంపిణీ సాగుతోందని, ఇప్పటి వరకు 3,34,908 జతలు సరఫరా చేయగా 57.60 శాతం పంపిణీ పూర్తయిందన్నారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 06:11 AM