పాఠశాల ప్రహరీ కూలి.. ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:11 AM
పాఠశాలలోని ప్రహరీ కూలి మీదపడడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
నారాయణపేట జిల్లా తీలేరులో ఘటన
మరికల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలోని ప్రహరీ కూలి మీదపడడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం విరామ సమయంలో మూత్ర విసర్జన కోసం నాలుగో తరగతి చదువుతున్న కార్తికేయ, రాజేశ్ పాఠశాల గోడ సమీపంలోకి వెళ్లగా.. అది ఒక్కసారిగా కూలి వారి మీద పడింది.
ఈ ఘటనలో కార్తికేయకు కాలు విరగగా.. రాజేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో విద్యార్థి చందు కూడా గాయపడ్డాడు. వారిని వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యాశాఖ అధికారికి సమాచారం అందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరగా.. అంతా గ్రామ సర్పంచ్ చూసుకుంటారని ఆయన సమాధానం చెప్పినట్లు గ్రామస్థులు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News