Share News

ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:36 AM

రాష్ట్రంలో రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించనున్న ‘ప్రజా పాలనలో రైతు ఉత్సవాలకు’ హాజరు కావాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.

ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల
Telangana Rythu Utsavalu

హైదరాబాద్, మార్చి19: రాష్ట్రంలో రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించనున్న ‘ప్రజా పాలనలో రైతు ఉత్సవాలకు’ హాజరు కలవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు(గురువారం) ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి తుమ్మల.. ఉత్సవాల నిర్వహణ, రైతు భోరోసా నిధుల విడుదలపై చర్చించారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేది నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ‘ప్రజా పాలనలో రైతు ఉత్సవాలను’ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతులను భాగస్వామ్యం చేస్తూ, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని, ప్రభుత్వ లక్ష్యాలను ఈ ఉత్సవాల ద్వారా చాటి చెప్పనున్నారు. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం ఈ నెల 22వ తేదీన చోటు చేసుకోనుంది. రైతు ఉత్సవాల ముగింపు వేదికగా, రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘రైతు భరోసా’ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ వేదిక ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయాన్ని జమ చేసే ప్రక్రియకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరితోనూ పొత్తు ఉండదు: విజయ్‌

16 మంది ఐపీఎస్‌లకు అవార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2026 | 01:56 PM