భూములమ్మైనా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తాం !: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:15 AM
ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విక్రయించి బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన ఐక్య కూటమి నాయకులు మంత్రి పొన్నంను శుక్రవారం కలిశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘాల నాయకులను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సీసీఎస్ బకాయిలతోపాటు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రశాంత్భూషణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
రేవంత్రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి
Read Latest AP News And Telangana News And International