Share News

ప్రభుత్వం దృష్టికి సమస్యలు: టీజీఆర్‌ఎస్ఏ

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:46 AM

రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు: టీజీఆర్‌ఎస్ఏ
TGRSA

రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. రికార్డు అసిస్టెంట్‌ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ వరకు అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పించాలని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు ఎఫ్‌టీఏ మంజూరు, ప్రతి మండలానికి ప్రొటోకాల్‌ బడ్జెట్‌ కేటాయింపు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు మరుగుదొడ్ల వసతి, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని తీర్మానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్‌

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:46 AM