విద్యుత్ శాఖ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 21.815 శాతానికి పెంపు..
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:24 PM
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ వేళ కరవు భత్యం, కరవు భృతి పెంచుతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ వేళ కరవు భత్యం (డీఏ), కరవు భృతి (డీఆర్) పెంచుతున్నట్లు ప్రకటించింది. డీఏను 2.543 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డీఏ 19.272 శాతం నుంచి 21.815 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయం 2026 జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రతి నెలా ప్రభుత్వ ఖజానాపై రూ.14.63 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 71,360 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
రూ.50వేల కోట్ల విలువైన భూములు కాజేసే కుట్ర.. గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్