పోలీసు పదోన్నతులపై కదలిక
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:36 AM
పోలీసు అధికారుల పదోన్నతుల్లో కదలిక వచ్చింది. 1991, 1995, 1996 ఎస్ఐ బ్యాచ్ అభ్యర్ధులతో ఇటీవల సమావేశమైన డీజీపీ ఆనంద్ ఏకాభిప్రాయంతో తుది ఎంపిక ప్యానెల్ రూపొందించడానికి అందర్ని ఒప్పించారు.
అధికారులపై కేసుల వివరాలు తెలపాలని ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారుల పదోన్నతుల్లో కదలిక వచ్చింది. 1991, 1995, 1996 ఎస్ఐ బ్యాచ్ అభ్యర్ధులతో ఇటీవల సమావేశమైన డీజీపీ ఆనంద్ ఏకాభిప్రాయంతో తుది ఎంపిక ప్యానెల్ రూపొందించడానికి అందర్ని ఒప్పించారు. ఈ క్రమంలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, అదనపు ఎస్పీ నుంచి నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులకు సంబంధించి ఆయా అధికారులపై ఎవైనా క్రిమినల్, ఏసీబీ కేసులు, శాఖాపరమైన విచారణలు పెండింగ్‌లో ఉంటే తెలపాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
33 మంది అదనపు ఎస్పీలు, 101 మంది డీఎస్పీల పేర్లతో ఉన్న జాబితా యూనిట్ అధికారులకు చేరింది. కేసుల వివరాలు డీజీపీ కార్యాలయానికి చేరిన తర్వాత ఈ ఫైల్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వద్దకు వెళ్తుందని, డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశం జరిగితే తుది పదోన్నతుల లిస్టు ఖరారు అవుతుంది. అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలకు సంబంధించిన పదోన్నతులు కావడంతో డీపీసీ సమావేశంలో జీఏడీ ఖరారు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి, డీజీపీ ఆనంద్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి శిఖాగోయల్ పాల్గొని తుదిజాబితాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇవి కూడా చదవండి...
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
Read latest Telangana News And Telugu NEws