Share News

పీజీ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా తుది మెరిట్‌ జాబితా విడుదల

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:19 AM

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా మెడికల్‌ పీజీ డిగ్రీ, డిప్లొమా అడ్మిషన్ల ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను కాళోజీ హెల్త్‌ వర్శిటీ విడుదల చేసింది.

పీజీ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా తుది మెరిట్‌ జాబితా విడుదల

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా మెడికల్‌ పీజీ డిగ్రీ, డిప్లొమా అడ్మిషన్ల ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను కాళోజీ హెల్త్‌ వర్శిటీ విడుదల చేసింది. ఈ జాబితాలో 1,612 మంది అభ్యర్థులకు చోటు దక్కింది.


తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం పలువురు పిటిషనర్ల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారిని ప్రస్తుతానికి అడ్మిషన్ల కోసం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆ అభ్యర్థుల అడ్మిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత రిట్‌ పిటిషన్ల తుది తీర్పునకు లోబడి ఉంటాయని రిజిస్ట్రార్‌ తన నోట్‌లో స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:19 AM