‘పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి 15 నుంచి వెబ్ ఆప్షన్లు
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:34 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నిమ్స్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద... పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నిమ్స్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద... పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించడంతో పాటు తుది మెరిట్ జాబితా, అదనపు జాబితా, పీడబ్ల్యూడీ అర్హత జాబితా, సీట్ మ్యాట్రిక్స్, 22 ప్రైవేట్ కాలేజీల ఫీజు వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన 3,611 మందితో ఫైనల్ మెరిట్ లిస్టును ప్రకటించిన వర్సిటీ... కోర్టు ఉత్తర్వులతో అదనపు జాబితాలో మరో ఇద్దరిని చేర్చడంతో మొత్తం అర్హుల సంఖ్య 3,613కు చేరింది.
మెరిట్ లిస్టులో ఉన్నవారు ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాగా.. రాష్ట్రంలోని 22 ప్రైవేట్ అన్-ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో 2026-29 బ్లాక్ పీరియడ్‌కు పాత ట్యూషన్ ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 163ను జారీ చేసింది. కౌన్సెలింగ్‌పై సందేహాల కోసం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9392685856, 7842136688, 9059672216, నిబంధనలపై 7901098840, 9490585796 ఫోన్ నంబర్లలో, పేమెంట్ గేట్‌వే సమస్యలకు 9618240276 నంబర్‌లో సంప్రదించవచ్చని వర్సిటీ తెలిపింది.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి