Share News

ఆయిల్ పామ్ రైతులకు 80:20 ఆదాయ వాటా.. కేంద్రానికి లేఖ రాయాలని తుమ్మల ఆదేశం

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:13 PM

తమకు 80:20 ఆదాయ భాగస్వామ్యం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయిల్ పామ్ రైతులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 75:25 నిష్పత్తిని 80:20కి మార్చాలని ఆయనకు రైతులు విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ పామ్ రైతులకు 80:20 ఆదాయ వాటా.. కేంద్రానికి లేఖ రాయాలని తుమ్మల ఆదేశం
TG Minister Tummala Nageswara Rao

హైదరాబాద్, నవంబర్ 17: తమకు 80:20 ఆదాయ భాగస్వామ్యం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయిల్ పామ్ రైతులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 75:25 నిష్పత్తిని 80:20కి మార్చాలని ఆయనకు రైతులు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి వెంటనే లేఖ రాయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయిల్ పామ్ రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి తుమ్మల దృష్టికి వారు తీసుకెళ్లారు.


ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని మంత్రి తుమ్మలను రైతులు కోరారు. అలాగే పెరిగిన ఎరువులు, కూలీల ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 80:20 ఆదాయ పంపిణీతో టన్నుకు రూ.1,516 అదనపు ఆదాయం వస్తుందని మంత్రికి రైతులు సోదాహరణంగా వివరించారు. ఎల్‌ నినో ప్రభావంతో దిగుబడులు తగ్గాయని.. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ రైతులకు న్యాయమైన ధర, స్థిరమైన ఆదాయం కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో రూ.40 లక్షల హాషిష్ ఆయిల్ పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య

Updated Date - Nov 17 , 2026 | 09:18 PM