తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్.. ఫిర్యాదుల కోసం TE-Poll యాప్..
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:57 PM
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు..
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) TE-Poll మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదులు చేయడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే.. tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని ఎస్‌ఈసీ పేర్కొంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదిన పోలింగ్ జరగనుంది, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!
Read Latest Telangana News And Telugu News