మంత్రి దామోదర కంటికి శస్త్రచికిత్స
ABN , Publish Date - Oct 12 , 2026 | 06:12 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు శనివారం కంటి శస్త్రచికిత్స జరిగింది. ఉన్నట్లుండి చూపు పూర్తిగా తగ్గిపోవడంతో ఆయన తనకు గతంలో కంటి శస్త్రచికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించారు.
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు శనివారం కంటి శస్త్రచికిత్స జరిగింది. ఉన్నట్లుండి చూపు పూర్తిగా తగ్గిపోవడంతో ఆయన తనకు గతంలో కంటి శస్త్రచికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించారు. గతంలో దామోదర రాజనర్సింహకు కంటిచూపు సమస్య ఉండటంతో లెన్స్ వేసినట్లు సమాచారం.
అయితే పనితీరులో తేడా రావడం వల్ల వాటిని తొలగించాల్సివచ్చింది. లెన్స్‌ను తీసివేసిన తర్వాత ఆ ప్రాంతంలో చిన్నచిన్న సూక్ష్మ రంధ్రాలు కనిపించడంతో వాటికి వైద్యం చేశారు. ప్రస్తుతం మంత్రి దామోదర ఒక కంటికి శస్త్రచికిత్స చేశారు. వారంలో మరో కంటికి కూడా సర్జరీ చేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీ సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్
డ్రగ్స్ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ నజర్
ఓటు కోల్పోయిన వారితో మీదగ్గరికొస్తా..!
Read Latest AP News And Telangana News