Share News

ఓటు కోల్పోయిన వారితో మీదగ్గరికొస్తా..!

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:04 AM

‘సర్‌ (ఎస్‌ఐఆర్‌)’ వల్ల ఓటు హక్కు కోల్పోయిన వారిని ఆధారాలతోపాటు తీసుకొస్తా. తేదీ, సమయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఓ ప్రకటనలో సవాల్‌ చేశారు.

ఓటు కోల్పోయిన వారితో మీదగ్గరికొస్తా..!
Ponnam Prabhakar

  • తేదీ, టైమ్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు పొన్నం సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌ (ఎస్‌ఐఆర్‌)’ వల్ల ఓటు హక్కు కోల్పోయిన వారిని ఆధారాలతోపాటు తీసుకొస్తా. తేదీ, సమయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఓ ప్రకటనలో సవాల్‌ చేశారు. ‘సర్‌’ వ్యతిరేక ఆందోళనలను తప్పు బట్టడంతోపాటు ఈ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన వారు ఉన్నారా? అని రాంచందర్‌రావు అన్న నేపథ్యంలో మంత్రి పొన్నం స్పందించారు.


తన తండ్రి పేరులో చిన్నపాటి వ్యత్యాసానికి ఆధారాలు చూపనందుకు తన ఓటునూ తొలగించే ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో 70 లక్షల పై చిలుకు ఓట్లు, హైదరాబాద్‌లోనే 40 లక్షల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్ల టోకరా

డ్రగ్స్‌ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్‌ నజర్‌

భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 06:06 AM