Share News

సిరిసిల్ల ఇంజనీరింగ్‌ కాలేజీ సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:08 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు.

సిరిసిల్ల ఇంజనీరింగ్‌ కాలేజీ సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్‌
KTR

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కళాశాల శాశ్వత క్యాంపస్‌ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతితో మంజూరైన భవన నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు.


కాగా, కొడంగల్‌ అగ్రికల్చరల్‌ కాలేజీలో బీఎస్సీ సీటు సాధించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని శ్రుతికి కేటీఆర్‌ రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమ కుటుంబానికి చదువు భారంగా మారిందని, సాయం చేయాలని ఎక్స్‌ వేదికగా శ్రుతి చేసిన విజ్ఞప్తిపై కేటీఆర్‌ స్పందించారు. ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌ ద్వారా ఆర్థిక సాయం పంపడమే కాకుండా.. విద్యార్థినితో ఫోన్లో మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్ల టోకరా

డ్రగ్స్‌ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్‌ నజర్‌

ఓటు కోల్పోయిన వారితో మీదగ్గరికొస్తా..!

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 06:08 AM