9 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అదనంగా రూ.365.40 కోట్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:29 AM
రాష్ట్రంలో రెండో విడత కింద ఏర్పాటైన 9 ప్రభుత్వ వైద్య కళాశాలల భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన కోసం సర్కారు అదనంగా రూ.365.40 కోట్లు మంజూరు చేసింది.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత కింద ఏర్పాటైన 9 ప్రభుత్వ వైద్య కళాశాలల భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన కోసం సర్కారు అదనంగా రూ.365.40 కోట్లు మంజూరు చేసింది. గతంలో మంజూరు చేసిన రూ.1,645 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.2,010.40 కోట్లకు సవరిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు జీవో జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం 2022 ఆగస్టులో ప్రభుత్వం రూ.1,645 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చింది. అనంతరం 2023 అక్టోబరు 6న జారీ చేసిన జీవో నం.174 ద్వారా ఆ నిధులను విభజించారు. ఇందులో రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) నుంచి ప్రతి కాలేజీకి రూ.130 కోట్ల చొప్పున రూ.1,170 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ వాటాను రూ.1,170 కోట్ల నుంచి 1,535.40 కోట్లకు ప్రభుత్వం పెంచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్