తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా టీజీఎస్‌టీఏ పేరు..లోగో: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:36 PM
రాష్ట్ర టెలివిజన్ అవార్డుల (TGSTA) పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టెలివిజన్ అవార్డ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, జులై 28: రాష్ట్ర టెలివిజన్ అవార్డుల (TGSTA) పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టెలివిజన్ అవార్డ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీవీ రంగ ప్రతిభను ప్రోత్సాహించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డుల (TGSTA)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. పూర్తి పారదర్శకతతో ఈ అవార్డుల ఎంపిక జరగాలని ఆయన పేర్కొన్నారు.
టెలివిజన్ సీరియల్స్, నాన్ - ఫిక్షన్, డాక్యుమెంటరీలకు అవార్డులు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఉత్తమ దర్శకుడు, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అవార్డులు ఇస్తామని చెప్పారు. న్యూస్ ఛానల్ యాంకర్లు, ప్రజెంటర్లకు కూడా అవార్డుల ప్రతిపాదన చేశామన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, వారసత్వాన్ని చాటే వాటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. నాన్-ఫిక్షన్‌కు కనీసం 13 ఎపిసోడ్‌లు, సీరియళ్లకు 100 ఎపిసోడ్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు.
అవార్డుల గైడ్ లైన్స్, లోగో, వేదిక ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డుల ప్రదానానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పి.వి. నరసింహారావు పేరుతో వారసత్వ పురస్కారంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
Read Latest AP News And Telugu News