Share News

రండి.. రైజింగ్‌ తెలంగాణలో భాగస్వాములవ్వండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:17 AM

హైదరాబాద్‌ను కృత్రిమ మేధ(ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

రండి.. రైజింగ్‌ తెలంగాణలో భాగస్వాములవ్వండి

  • ఐరాస వేదికగా జరిగిన 1ఎం1బీ గ్లోబల్‌ సదస్సులో

  • అంతర్జాతీయ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను కృత్రిమ మేధ(ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) వేదికగా 1ఎం1బీ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ ఇంపాక్ట్‌ సదస్సులో శుక్రవారం ఆయన ప్రసంగించారు.


తెలంగాణలో ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, బలమైన పారిశ్రామిక పునాదులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి... రైజింగ్‌ తెలంగాణ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:18 AM