Share News

రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్లు

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:58 AM

రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు రంగం సిద్థమైంది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ‘2బీ బార్‌’గా వ్యవహరిస్తారు.

రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్లు
Telangana 2B bars

  • ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,131 బార్లు

  • క్యూర్‌, కొత్త మున్సిపాలిటీల జనాభా

  • ప్రాతిపదికన కొత్తవి కేటాయింపు

  • నేటి నుంచి దరఖాస్తులు.. ఫీజు రూ.లక్ష

  • అక్టోబరు 12 వరకు గడువు

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు రంగం సిద్థమైంది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ‘2బీ బార్‌’గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన క్యూర్‌ (సీయూజీఆర్‌ఈ) పరిధిలో 14 బార్లు, మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 27 బార్ల చొప్పున మొత్తం 41 బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. క్యూర్‌ పరిధి ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీల ఆవిర్భావం, మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ కొత్త బార్లను కేటాయించారు.


సోమవారం నుంచి అక్టోబరు 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి దరఖాస్తుకు రూ.లక్ష నాన్‌-రిఫండబుల్‌ రుసుముగా చెల్లించాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,131 బార్లు ఉన్నాయి. వీటిలో ఏడాది క్రితం 14 కొత్త బార్ల ఏర్పాటుకు అనుమతించారు. ప్రస్తుతం క్యూర్‌ పరిధిలోని గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు సంబంధించిన 14 బార్ల దరఖాస్తులను అబ్కారీ భవన్‌లోని కమిషనర్‌ కార్యాలయంతో పాటు, ఆయా ప్రాంతాల డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు.


మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాలతో పాటు కమిషనర్‌ కార్యాలయం, డీపీఈవో కార్యాలయాల్లోనూ సమర్పించవచ్చని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌ పేర్కొన్నారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో బార్లు కేటాయిస్తారు. జిల్లాలవారీగా బార్ల లైసెన్స్‌ ఫీజులను ఎక్సైజ్‌ శాఖ ఖరారు చేసింది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 2బీ బార్‌కు సంవత్సరానికి రూ.44 లక్షలు, నిజామాబాద్‌ బోధన్‌ బార్‌కు రూ.42 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లోని బార్లకు సంవత్సరానికి రూ.30 లక్షల చొప్పున ఎక్సైజ్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు, ఇతర మార్గదర్శకాల కోసం టీజీబీసీఎల్‌.తెలంగాణ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎక్సైజ్‌ అధికారులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:
మేడిగడ్డకు పూర్తిస్థాయి డయాఫ్రమ్‌ వాల్‌

ఉధృతంగా గోదావరి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 04:58 AM