హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ సస్పెన్షన్
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:15 AM
హౌసింగ్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ)గా పనిచేస్తున్న చంద్రపాల్‌ను సస్పెండ్ చేసినట్టు కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తనిఖీసమాచారం లీక్‌పై చర్యలు
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ)గా పనిచేస్తున్న చంద్రపాల్‌ను సస్పెండ్ చేసినట్టు కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అసలైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా.. లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు హౌసింగ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేయడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కొల్లూరులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించినా చాలామంది లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండడం లేదన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించగా.. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డీఈఈ చంద్రపాల్ ఆ సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేసినట్టు కార్పొరేషన్ దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టగా.. తనిఖీల సమాచారం లీకైందన్న విషయం నిర్ధారణ కావడంతో చంద్రపాల్‌ను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్టు ఎండీ గౌతమ్ ప్రకటనలో తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News