సివిల్ డ్రెస్‌లు.. ఎఫ్‌ఐఆరుల్లేని దర్యాప్తులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:06 AM
పోలీసు దుస్తుల్లో కాకుండా సాధారణ పౌరుల్లా సివిల్ డ్రెస్‌లో వచ్చి తనిఖీలు చేయడం.. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండానే కేసులు దర్యాప్తు చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల తీరుపై హైకోర్టులో పిటిషన్
పోలీసు దుస్తుల్లో కాకుండా సాధారణ పౌరుల్లా సివిల్ డ్రెస్‌లో వచ్చి తనిఖీలు చేయడం.. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండానే కేసులు దర్యాప్తు చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోరబండకు చెందిన బీ బాలరాజ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై మంగళవారం జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ అనుమానితులకు వాదనలు వినిపించే అవకాశం లేకుండా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..హోంశాఖ, డీజీపీలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News