Share News

లిఫ్టుల భద్రతపై 2 నెలల్లో చట్టాన్ని చేయండి

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:38 AM

బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఎలివేటర్ల (లిఫ్ట్‌ల) భద్రతపై ఎప్పటి నుంచో చర్చలో ఉన్న నూతన చట్టం రూపకల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

లిఫ్టుల భద్రతపై 2 నెలల్లో చట్టాన్ని చేయండి
Telangana High Court

  • సీఎస్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఎలివేటర్ల (లిఫ్ట్‌ల) భద్రతపై ఎప్పటి నుంచో చర్చలో ఉన్న నూతన చట్టం రూపకల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎనిమిది వారాల్లో ముసాయిదాను రూపొందించి మంత్రిమండలి ఎదుట ఉంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎలివేటర్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు సరిగాలేక గత ఏడాది పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ మృతి సహా పలు ప్రమాదాలు చోటుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ పలువురు రాసిన లేఖలను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా నమోదు చేసింది.


మంగళవారం ఇది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోసీ, జస్టిస్‌ చలపతిరావుల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముసాయిదా బిల్లును పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు పంపించామని. బిల్లు రూపకల్పనకు మరో రెండునెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ల న్యాయవాదులు పంపిన మార్గదర్శకాలను పరిశీలించి.. అవి బిల్లులో లేకపోతే చేర్చాలని సూచించింది.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:38 AM