Share News

గురుకులాల్లో ఇక డిజిటల్‌ హాజరు

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:37 AM

గురుకుల విద్యార్థుల హాజరు ఇక డిజిటల్‌ విధానంలో నమోదు కానుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని అన్ని గురుకులాల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ఆధారిత అటెండెన్స్‌ విధానాన్ని ఈ నెల 10లోగా పూర్తి చేయాలని సంస్థ కార్యదర్శి రవి గుగులోతు ఆదేశించారు.

గురుకులాల్లో ఇక డిజిటల్‌ హాజరు
Gurukuls digital attendance

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యార్థుల హాజరు ఇక డిజిటల్‌ విధానంలో నమోదు కానుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని అన్ని గురుకులాల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ఆధారిత అటెండెన్స్‌ విధానాన్ని ఈ నెల 10లోగా పూర్తి చేయాలని సంస్థ కార్యదర్శి రవి గుగులోతు ఆదేశించారు. గురుకులాల్లో లైబ్రరీలు, ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ మెటీరియల్‌, ఇతర విద్యా వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.


ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు స్టాక్‌, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి హెడ్‌ ఆఫీ‌స్‌లో నిరంతరం టోల్‌ఫ్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జూమ్‌ సమావేశం నిర్వహించి గురుకులాల పనితీరు, విద్యార్థుల ప్రగతి, సమస్యలను సమీక్షిస్తామని రవి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
రాహుల్‌ పోరాటంతో కేంద్రంలో వణుకు

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
బతికున్న భార్య ఓటును తొలగించాలని.. మరణించిన భర్త దరఖాస్తు!
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:37 AM