గోదావరి ఫేజ్-2 పనులకు రాంకీతో ఒప్పందం
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:57 AM
హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చే గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో రాంకీ సంస్థ ఎంపిక కాగా, ఆ సంస్థతో వాటర్ బోర్డు కుదుర్చుకున్న ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జలమండలి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
రూ.1,992 కోట్లతో ప్రాజెక్టు పనులు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చే గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో రాంకీ సంస్థ ఎంపిక కాగా, ఆ సంస్థతో వాటర్ బోర్డు కుదుర్చుకున్న ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ దక్కించుకున్న రాంకీ సంస్థ, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంది. వాటర్ బోర్డుతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక లావాదేవీల కోసం ఎస్ర్కో ఖాతాను, సబ్‌స్టిట్యూషన్ ఒప్పందాలను కూడా పూర్తి చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని జలమండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించగా, తాజాగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రూ.1,992 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టును నిర్మించడంతో పాటు పదేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతలను కూడా రాంకీ సంస్తే చూడనుంది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఘన్‌పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల వరకు పైపులైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఘన్‌పూర్‌తో పాటు ఆయా జలాశయాల వద్ద గోదావరి జలాలను శుద్ధి చేయడం తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులను ఇప్పటికే ఘన్‌పూర్ వద్ద రాంకీ సంస్థ ప్రారంభించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యారంటీ లేకుండానే రైస్ మిల్లు ఆస్తుల బదిలీ
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News