విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:32 PM
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు అందరికి బ్రేక్ పాస్ట్ పథకాన్ని అందిస్తామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 20: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు అందరికి బ్రేక్ పాస్ట్ పథకాన్ని అందిస్తామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుని వస్తున్నామన్నారు. ఈ పథకాలను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వివరించారు.
శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దివ్యాంగ, శారీరక వైకల్య విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్‌డ్ వాహనాల పంపిణీ చేస్తామని తెలిపారు. సంక్షేమ స్కూళ్లలో వసతుల మెరుగుకు చర్యలు చేపడతామన్నారు. అందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీని విద్యా శాఖ పరిధిలోకి తీసుకు వస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.5 లక్షల జీవితబీమా.. ఈ పథకం ఎప్పటినుంచి అమలు చేయనున్నారంటే..
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు
For More TG News And Telugu News