Share News

‘గ్లోబల్‌ సమ్మిట్‌’ను వాయిదా వేయండి

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:47 AM

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు, తాగునీటి కొరత నెలకొన్న నేపథ్యంలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి 400 మందికిపైగా పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు.

‘గ్లోబల్‌ సమ్మిట్‌’ను వాయిదా వేయండి
Telangana Global Summit

  • ఎల్‌నినో నేపథ్యంలో నిర్వహణ సరికాదు

  • సీఎంకు ప్రజా సంఘాల ప్రతినిధుల బహిరంగ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు, తాగునీటి కొరత నెలకొన్న నేపథ్యంలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి 400 మందికిపైగా పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం డిసెంబరు 7,8,9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో వారు సీఎంకు ఈ మేరకు లేఖ రాశారు.


ఎల్‌నినో నేపథ్యంలో సమ్మిట్‌ నిర్వహణ సరికాదని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత నిర్వహించాలని కోరారు. సంక్షోభ సమయంలో కోట్ల రూపాయల ఖర్చుతో భారీఎత్తున గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ప్రొఫెసర్‌ శాంతా సిన్హా, ప్రొఫెసర్‌ డి. నరసింహారెడ్డి, ఆకునూరి మురళి, ఈఏఎస్‌ శర్మ, ప్రఫుల్ల సమంతర, సి. వనజ, డా. శ్రీనివాస రెడ్డి మండల, డా. పార్థసారధి రెడ్డి, మరియ తబస్సుం సహా పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు సంతకాలు చేశారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:47 AM