Share News

కీరవాణి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ ఆంథమ్.. నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం: సీఎస్ సంజయ్ జాజు

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:20 PM

గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.

కీరవాణి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ ఆంథమ్.. నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం: సీఎస్ సంజయ్ జాజు
TG CS Sanjay jaju

హైదరాబాద్, నవంబర్ 25: గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమిటీలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో ఈ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రోటోకాల్, ఫుడ్, కల్చరల్ కమిటీలతో సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం రూపకల్పన చేశామని తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ ఆంథమ్ తయారీ చేసినట్లు వివరించారు.


డిసెంబర్ 7న తెలంగాణ సాంస్కృతిక, జానపద కళారూపాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎస్ సంజయ్ జాజు చెప్పారు. డిసెంబర్ 9న క్లైమేట్ కాన్సర్ట్ సందర్భంగా భారీగా సాంస్కృతిక వేడుకలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమ్మిట్‌లో 45కుపైగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్రత్యేక రుచులతో 30 వరకు ఫుడ్ స్టాళ్ల ఏర్పాటు చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమ ప్రముఖులతో పాటు జాతీయ, అంతర్జాతీయ అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని సీఎస్ సంజయ్ జాజు చెప్పారు.


ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2026, డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో 1000కిపైగా కంపెనీలు, వేలాది మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల వేళ.. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐజీ రాజకుమారి

లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్

Updated Date - Nov 25 , 2026 | 07:40 PM