ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:47 PM
ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరి కృషితోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరి కృషితోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సిటీ నిర్మాణం అంత సులభం కాదన్నారు ముఖ్యమంత్రి. నూతనంగా ఏర్పాటు చేసే నగరంలో తమనూ కలపాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ భవనం, OCTOPUS అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయాలను ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికీ సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది నేతలు హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.
ఈ సిటీ నిర్మాణానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. ప్రపంచంతో పోటీపడేలా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ లోపు ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. గతంలో హైటెక్ సిటీ అంటే అవహేళన చేశారని.. ఏ నగరానికీ లేని ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు ఉందన్నారు. మూడు కొవిడ్ వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు. యుద్ధ విమాన సర్వీస్ సెంటర్లూ హైదరాబాద్‌లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్