పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:59 PM
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై ధర్మేంద్ర అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో తనను ఆమె ఆర్థికంగా వంచించిందని, ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే అషురెడ్డి బెదిరిస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 28: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై ధర్మేంద్ర అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో తనన ఆమె ఆర్థికంగా వంచించిందని, ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తోందని వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. గత రెండేళ్లుగా అషురెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని, ఆ నమ్మకంతోనే ఇల్లు, బంగారం కొనిపించానని వెల్లడించారు.
లండన్‌లో ఉంటున్న ధర్మేంద్ర.. ABN ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘గత రెండేళ్లుగా అషురెడ్డి నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చింది. తన అవసరాల కోసం బ్యాంకులో లోన్ తీసుకున్నా. నా తండ్రి కూడా బయట అప్పులు చేసి మరీ ఆమెకు ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఆమె ముఖం చాటేస్తోంది. పెళ్లి చేసుకోనప్పుడు నా డబ్బులు, ఇల్లు తిరిగి ఇవ్వాలి. మొదట ఇస్తానని చెప్పిన ఆశు.. ఆ తర్వాత మాట మార్చింది. డబ్బులు అడిగితే నన్ను బెదిరిస్తోంది. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులకు సమర్పించా. ఆ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు FIR నమోదు చేశారు. ఈ గొడవను బయట సెటిల్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అషురెడ్డి వేధింపులు భరించలేకే మా నాన్న చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము న్యాయం కోసం లీగల్ గానే పోరాటం చేస్తాం’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్, సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్