Share News

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:56 PM

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
IPS C V Anand

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.


ఏప్రిల్ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది. అందుకు రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు జాబితాను ఇటీవల యూపీఎస్సీ.. రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా ఉన్నారు. వారిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రైవేట్ కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ పర్యాటక శాఖలో కొలువులు

For More TG News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 06:16 PM