Share News

ప్రైవేట్ కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:14 PM

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేట్ కాలేజీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక లే అవుట్‌లో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐడీ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..

ప్రైవేట్ కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
AP High Court

అమరావతి, ఏప్రిల్ 28: కడప జిల్లా ప్రొద్దుటూరులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ ప్రైవేట్ కాలేజీ కోసం.. లే అవుట్‌లో ప్రభుత్వ నిధులతో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ.. సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పైవిధంగా స్పందించింది. తమ అనుమతి లేకుండా రహదారి వేశారంటూ లే అవుట్‌లోని పలువురు భూ యజమానులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలంటూ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.


రహదారి వేసే సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. కానీ ప్రైవేట్ భూముల్లో భూ సేకరణ చేయకుండానే ఈ రోడ్డు వేశారంటూ కోర్టుకు జిల్లా కలెక్టర్ నివేదిక అందజేశారు. రోడ్డు నిర్మాణం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని కోర్టు స్పష్టం చేసింది. దీనికి ఆ సమయంలో ఉన్న అధికారులు, కౌన్సిల్ చైర్మన్‌తో పాటు సభ్యులు కారణమయ్యారని స్పష్టం చేసింది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సీఐడీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లే అవుట్‌లో రహదారి నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 28 , 2026 | 04:46 PM