విదేశీ మద్యం ధరల పెంపు
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:33 AM
రాష్ట్రంలోని విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశీ మద్యం ధరలను సగటున 6శాతం వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫుల్ బాటిల్‌పై రూ.30-100 దాకా
అదనపు భారం.. సగటున 6 శాతం పెరుగుదల
ఈ నెల 12నే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశీ మద్యం ధరలను సగటున 6శాతం వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం.. అసెస్సబుల్ వ్యాల్యూస్ (ఏవీఎస్) సమీక్షించి ధరల పెంపునకు అనుమతినిచ్చింది.
ఈ పెంపుతో బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు వినియోగదారులపై భారం పడనుంది. సవరించిన రిటైల్ ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ జారీ చేసిన అధికారిక సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం డిపోల్లో ఉన్న నిల్వలతోపాటు ఇకపై రవాణా చేసే ప్రతి విదేశీ మద్యం బాటిల్‌పై తప్పనిసరిగా సవరించిన నూతన ఎమ్మార్పీతో కూడిన స్టిక్కర్లను అతికించాలని నమోదిత విదేశీ మద్యం సరఫరాదారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్
రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది
Read Latest AP News And Telangana News And International