వ్యవసాయ శాఖ ఆస్తుల రక్షణకు ఐఏఎస్‌లతో కమిటీ: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jun 04 , 2026 | 07:09 PM
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను ముందుగానే సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్04: వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను ముందుగానే సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఎల్- నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామసభల్లో రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ నీటితో పంటల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు. పంట వ్యర్థాలను కాల్చడంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం అన్ని జిల్లాల్లో శాటిలైట్ ఆధారిత పంట వ్యర్థాల కాల్చివేతలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
కొహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు చెప్పారు. రూ. 2,284.32 కోట్లతో కొహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. జూన్ 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఇక వ్యవసాయశాఖకు చెందిన ఖాళీ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ఈ ఆస్తుల రక్షణ కోసం ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ లేదా లీజు ద్వారా ఆదాయం సమీకరణ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఫెర్టిలైజర్ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసలు కురిపించిందని చెప్పారు. తెలంగాణ ఎరువుల పర్యవేక్షణ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కేంద్ర ఫెర్టిలైజర్ యాప్ అమలుకు తెలంగాణను పైలట్ రాష్ట్రంగా ఎంపిక చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. యాప్ సమర్థ అమలుకు రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. జూన్ 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది సేవలు అందించాలని వారికి మంత్రి పొంగులేటి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest TG News And Telugu News