Share News

రికార్డు స్థాయిలో ఒకేరోజు 6 లక్షలమంది కూలీలకు ఉపాధి: సీతక్క

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:48 AM

రాష్ట్రవ్యాప్తంగా వీబీజీరామ్‌జీ ఉపాధి పనులకు కూలీల హాజరు గణనీయంగా పెరుగుతోందని, ఈనెల 18న రికార్డు స్థాయిలో ఒకేరోజు 6 లక్షలమందికి పైగా కూలీలు హాజరయ్యారని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో ఒకేరోజు 6 లక్షలమంది కూలీలకు ఉపాధి: సీతక్క
Seethakka

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వీబీజీరామ్‌జీ ఉపాధి పనులకు కూలీల హాజరు గణనీయంగా పెరుగుతోందని, ఈనెల 18న రికార్డు స్థాయిలో ఒకేరోజు 6 లక్షలమందికి పైగా కూలీలు హాజరయ్యారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు.


ప్రస్తుతం రోజుకు ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 47 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, ఆ సంఖ్యను 60 పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి కోరే ప్రతి ఒక్కరికీ పని కల్పించడంతోపాటు కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు మేట్ల నియామకాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి 40మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని, ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న మేట్లకు డిసెంబరు 1 నుంచి బాధ్యతలు అప్పగించాలన్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 05:48 AM