టీసీఏ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2026 | 03:47 PM
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద క్రీడాకారులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. టీసీఏ ఏర్పాటు అయితేనే గ్రామీణ క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని నిరసనకారులు అంటున్నారు. టీసీఏని ఏర్పాటు చేయకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద క్రీడాకారులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. టీసీఏ ఏర్పాటు అయితేనే గ్రామీణ క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని నిరసనకారులు అంటున్నారు. టీసీఏని ఏర్పాటు చేయకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు తలచుకుంటే టీసీఏ వస్తుందని, అందుకు నేతలంతా కృషి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA), పలువురు క్రికెటర్లపై ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ కానివాళ్లు పెత్తనం చేస్తారా?
ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. టీసీఏకు బీసీసీఐ గుర్తింపునివ్వాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన రూ.600కోట్లను హెచ్‌సీఏ పెద్దలు తినేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పులను కూడా హెచ్‌సీఏ ధిక్కరిస్తోందని.. తెలంగాణ, తెలుగు తెలియని వారు హెచ్‌సీఏను ఏలుతున్నారంటూ గురువారెడ్డి ఆగ్రహించారు. హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్‌కు బీసీసీఐ గుర్తింపు లేదని.. అలాంటి లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్న మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఇబ్బందుల్లో పడతారన్నారు. మహ్మద్ సిరాజ్ నాన్ లోకల్, తిలక్ వర్మ ఆంధ్ర ప్లేయర్ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రాకు చెందిన అంబటి రాయుడు, చాముండేశ్వరినాథ్, బస్వరాజులు హెచ్‌సీఏలో పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. టీసీఏకు గుర్తింపు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ కృషి చేస్తున్నారని గురువారెడ్డి చెప్పుకొచ్చారు.
జైషా ఇంటి ముందు నిరసన చేస్తాం..
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. టీసీఏ ఏర్పాటు చేయకుంటే ఢిల్లీలో అమిత్ షా, జైషా ఇంటి ముందు మౌనదీక్షకు దిగుతామని హెచ్చరించారు. కిషన్ రెడ్డి, డీకే అరుణ తలుచుకుంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వస్తుందన్నారు. రాదు అనుకున్న తెలంగాణ వచ్చిందని.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు రాదంటూ ఆయన ప్రశ్నించారు. శివలాల్ యాదవ్, ఎమ్మెల్సీగా ఓడిపోయిన జీవన్ రెడ్డి వంటి వారు హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీఏ తీరుతో గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందన్నారు. టీసీఏ ఏర్పాటు అయితేనే గ్రామీణ ఆటగాళ్లకు న్యాయం జరుగుతుందని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్