Share News

ప్రభుత్వ కమిటీల్లో సీపీఎస్‌ ఉద్యోగులకు చోటివ్వాలి: స్థితప్రజ్ఞ

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:48 AM

ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య బీమా పథకంతోపాటు వివిధ ప్రభుత్వ కమిటీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కోరారు.

ప్రభుత్వ కమిటీల్లో సీపీఎస్‌ ఉద్యోగులకు చోటివ్వాలి: స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య బీమా పథకంతోపాటు వివిధ ప్రభుత్వ కమిటీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కోరారు. ఈ మేరకు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్‌, ఇతర నాయకులతో కలిసి శనివారం పలువురు మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు.


వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను కలిసిన సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు.. రిటైరైన సీపీఎస్‌ ఉద్యోగులకు బేసిక్‌ పేలో 1.5 శాతం చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపునిచ్చి.. ఉచితంగా హెల్త్‌ కార్డులు జారీ చేయాలని కోరారు. అటుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను కలిసి.. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 01:48 AM