ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:47 AM
రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు.
సీపీఎంను కోరిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో శుక్రవారం జాన్‌వెస్లీతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి, టి.సాగర్, పోతినేని సుదర్శన్‌రావు, బండారు రవికుమార్‌లతో... మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుతో పాటు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చించారు. అనంతరం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని సీపీఎం నాయకులను కోరామని తెలిపారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు తమ మద్దతు కోరారని తెలిపారు. ఈ రెండు సీట్లలోనూ గతంలో తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన ఓట్లు సాధించారని.. ఈ నేపథ్యంలో తాము కూడా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International