తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీళ్లే.. ?
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:03 PM
తెలంగాణ నుంచి రాజ్యసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సమాచారం.
హైదరాబాద్, మార్చి 04: తెలంగాణ నుంచి రాజ్యసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే మరో అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఒకరు బీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేశ్ రెడ్డి, మరొకరు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ. అయితే అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి పెద్దల సభకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. కాగా వీరిద్దరు గురువారం నామినేషన్ వేసే అవకాశం ఉంది.
అభిషేక్ మను సింఘ్వీకి ఎంపీ సీటు కేటాయించడంతో.. మరో ఎంపీ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సీటు కోసం దాదాపు 16 మంది పోటీ పడ్డారు. వారిలో సీనియర్లే కాదు సూపర్ సీనియర్లు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో చర్చించారు. చివరకు వేం నరేందర్ రెడ్డి వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
Read Latest Telangana News And Telugu News