Share News

పార్టీ నేతలతో కొత్త ఇన్‌చార్జ్‌ వ్యక్తిగత భేటీలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:43 AM

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్‌ సందీప్‌.. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో వ్యక్తిగత భేటీలు నిర్వహించనున్నారు.

పార్టీ నేతలతో కొత్త ఇన్‌చార్జ్‌ వ్యక్తిగత భేటీలు

  • రేపు హైదరాబాద్‌కు రానున్న సందీప్‌..

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్‌ సందీప్‌.. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో వ్యక్తిగత భేటీలు నిర్వహించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌కు రానున్న ఆయన.. ఉదయం జరిగే టీపీసీసీ రాజకీయ, సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, కమిటీల సభ్యులు పాల్గొననున్నారు.


రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణతో పాటుగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం టీపీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. సోమవారం సందీప్‌.. తన వ్యక్తిగత సమావేశాలు చేపట్టనున్నారు. ఆ రోజున ఉదయం మంత్రులతోనూ, మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులతోనూ ఒకరి తర్వాత ఒకరితో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు ఢిల్లీకి వెళ్లిపోతారు. ఈ నెల 27న మళ్లీ హైదరాబాద్‌కు రానున్న సందీప్‌.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విడివిడిగా సమావేశమవ్వనున్నారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:43 AM