ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్!
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:20 AM
‘సర్’కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ తెలంగాణ ప్రజా ప్రతినిధులు, నేతలు ఆదివారం రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
నేడు ఇండీ కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన
గోవా నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్
హైదరాబాద్ నుంచి టీపీసీసీ చీఫ్ సహా 60 మందికి పైగా ప్రజా ప్రతినిధులు
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘సర్’కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ తెలంగాణ ప్రజా ప్రతినిధులు, నేతలు ఆదివారం రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గోవా రాజధాని పనాజీలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర 60 మందికి పైగా నాయకులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇండీ కూటమి తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాలంటూ మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను ఏఐసీసీ ఆదేశించిన నేపథ్యంలో అంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News