Share News

పార్టీ ఇన్‌చార్జితో చర్చించాక వారిపై చర్యలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:02 AM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధురెడ్డిలు ఇటీవల పార్టీ లైన్‌ దాటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని..

పార్టీ ఇన్‌చార్జితో చర్చించాక వారిపై చర్యలు

  • రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిలపై మహేశ్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశాం: మల్లు రవి

అచ్చంపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధురెడ్డిలు ఇటీవల పార్టీ లైన్‌ దాటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. వారిపై చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎంపీ మల్లు రవి చెప్పారు.


టీపీసీసీ కమిటీల సమావేశానికి హాజరుకానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సందీప్‌తో చర్చించి చర్యలు తీసుకొనే అవకాశముందని తెలిపారు. పార్టీలో ఎంతటి వారైనా క్రమశిక్షణ పాటించకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో మల్లు రవి ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 05:55 AM