Share News

ఎంపీ పుట్టా మహేశ్ అంశంపై స్పందించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:16 PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌కి స్టేషన్ బెయిల్‌ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ కేసు త్వరితగతిన విచారించడానికే సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ వివరించారు.

ఎంపీ పుట్టా మహేశ్ అంశంపై స్పందించిన సీఎం రేవంత్

న్యూఢిల్లీ, మార్చి 18: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్‌కి స్టేషన్ బెయిల్‌ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ కేసు త్వరితగతిన విచారించడానికే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సీఎం రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. 2028లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందే వస్తే తనకూ సంతోషమేనని పేర్కొన్నారు.


అంతకముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని వారికి పరిచయం చేశారు. ఈ పర్యటనలో రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. పార్లమెంట్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సీఎం రేవంత్ రెడ్డి, ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిరువురు ఒకరినొకరు పలకరించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

వసంత నవరాత్రులు.. ఇలా చేస్తే..

For More TG News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 02:39 PM