వసంత నవరాత్రులు.. ఇలా చేస్తే..
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:48 AM
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాలుగు సార్లు అమ్మవారి నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు అని పిలుస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాలుగు సార్లు అమ్మవారి నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు అని పిలుస్తారు. ఇవి ఉగాది పర్వదినం రోజు నుంచి ప్రారంభమై.. శ్రీరామనవమి రోజు ముగుస్తాయి. అంటే.. మార్చి 19న ప్రారంభమై.. మార్చి 27వ తేదీతో ఈ వసంత నవరాత్రులు ముగియనున్నాయి.
ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఆయా రోజుల్లో అమ్మవారి ఆశీర్వాదం పొందడం కోసం భక్తులు ఉపవాసం, ఆచారాలు పాటిస్తారు. ఈ నవరాత్రుల వేళ.. నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారని వేద పండితులు చెబుతున్నారు.
ఈ నవరాత్రుల్లో ఇలా చేయడం వల్ల..
ఉదయం, సాయంత్రం వేళల్లో ఆవు నెయ్యితో అమ్మవారికి దీపారాధన చేయాలి.
ఎరుపు రంగు పూలతో ఆమ్మవారిని పూజించాలి.
శక్తి కొద్ది నైవేద్యంగా పులిహార, పాయసం సమర్పించాలి.
ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే..
ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి.
ఐశ్వర్యం లభిస్తుంది.
అవివాహితులకు వివాహం అవుతుంది.
ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
వీటిని పారాయణం చేస్తే..
వసంత నవరాత్రులలో (చైత్ర మాసం) అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీలలితా సహస్రనామ స్తోత్రం, దుర్గా సప్తశతి, లలితా అష్టోత్తరం, దేవి ఖడ్గమాల స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేయడం అత్యంత విశేషం. ఈ నవరాత్రుల్లో ప్రతి రోజూ దుర్గామాతను ఆరాధిస్తూ.. సాయంత్రం దీపారాధన చేసి ఈ స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, సకల శుభాలు కలుగుతాయిని భక్తులు నమ్ముతారు.
ప్రతి ఏడాది నవరాత్రులు నాలుగు సార్లు జరుగుతాయి.
1) మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు
2) చైత్రమాసంలో వసంత నవరాత్రులు (ప్రస్తుతం జరగనున్నవి..)
3) ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు
4) ఆశ్వ యుజమాసంలో శరన్నవరాత్రులు
ఈ వార్తలు కూడా చదవండి..
వసంత నవరాత్రులు.. ఇలా చేస్తే..
ఉగాది రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా శుభమే
For More Devotional News And Telugu News